Animal

Action, Crime, Drama

Releasing Dec. 1, 2023

Hindi, Telugu, Tamil, Kannada, Malayalam

Releasing Dec. 1, 2023

Post on 2023-11-28

‘యానిమల్’ లోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. యానిమల్ బాక్సాఫీసు వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్' ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ క‌పూర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రెస్ మీట్ నిర్వహించింది.


ప్రెస్ మీట్ లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. నా మొదటి సినిమాకి వచ్చినపుడు నా తొలి అటోగ్రాఫ్ హైదరాబాద్ లోనే ఇచ్చాను. ఇక్కడ ప్రేక్షకులు సినిమాల పట్ల చూపించే ప్రేమ ఆదరణ అద్భుతంగా వుంటుంది. తెలుగు రాష్ట్రాల అబ్బాయిగా వుండాలని వుంది. నన్న దత్తత తీసుకోవాలని కోరుతున్నాను( నవ్వుతూ). ఈ చిత్రంలో చాలా విలక్షణమైన పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఇంటెన్స్ గా వుంటుంది. తన తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ వున్న కొడుకు పాత్రలో కనిపిస్తాను. అలాగే ఈ చిత్రంలో నా భార్య గీతాంజలి పాత్రతో కూడా చాలా ఘాడమైన ప్రేమలో వుంటాను. యానిమల్స్ అన్ ప్రెడిక్ట్బుల్ గా వుంటాయి. ఇందులో నా పాత్ర ఆ స్వభావంతో వుంటుంది. యానిమల్ కథ, పాత్రలు అందరికీ కనెక్ట్ అవుతాయి. చాలా హార్డ్ వర్క్ చేసిన ఈ చిత్రం చేశాం. అందరూ డిసెంబర్ 1న తప్పకుండా యానిమల్ ని చూడాలి'' అని కోరారు.

More


# Animal Big announcement!

The highly anticipated film #Animal is open for early booking. Make sure to reserve your seat for ... Read more

The much awaited song out now

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’లో హీరోయిన్‌గా రష... Read more

#Animal is on a rampage, rewriting box office history!

The cult blockbuster #AnimalTheFilm rakes in a whopping 236 CR Gross worldwide in just 2 days @An... Read more

‘యానిమల్’ లోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. యానిమల్ బాక్సాఫీసు వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది


Post on: 2023-11-28 13:04:44

Comments


Profile Pic

×